జనసేన జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా బెక్కం జనార్దన్

 

జగిత్యాల ప్రతినిధి, జూన్ 13(ప్రజా బలం) తెలంగాణలో జనసేన విస్తరణలో భాగంగా అధినేత పవన్ కళ్యాణ్ 26 నియోజక వర్గ ఇంచార్జ్ లను నియమించారు. ఇందులో భాగంగానే జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ గా బెక్కం జనార్దన్ ను పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడమే జనసేన లక్ష్యమని పవన్ కళ్యాణ్ సూచించినట్లు జనార్దన్ పేర్కొన్నారు. జనసేన యూత్ వింగ్ తో ప్రారంభమై ఈ స్థాయికి చేరిందన్నారు. వచ్చిన అవకాశాన్ని సరదాగా తీసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని పవన్ సూచించారన్నారు. ఏ పార్టీలోనూ ఇంత పెద్ద ఎత్తున యువతకు బాధ్యతలు అప్పగించరని ఇదే స్ఫూర్తితో గ్రామాల్లోని యువతను జనసేన వైపు మళ్లించాలని పవన్ సూచించినట్లు జనార్దన్ పేర్కొన్నారు. జనసేనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని, తనను నియమించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జనార్ధన్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking