రోళ్లవాగుపై మాట్లాడే అర్హత ‘జీవన్’ కు లేదు

*
రూపాయి ఖర్చు పెట్టని మీరా మాట్లాడేది

గతం గుర్తు చేసుకొని విమర్శించాలి

రోల్లవాగే అనవసరమంటున్నావు
_
25 గ్రామాలకు నిరందడం అనవసరమా..

చివరి దశలో రోల్లవాగు పనులు

జీవన్ రెడ్డిపై మంత్రి ఈశ్వర్ మండిపాటు

జగిత్యాల ప్రతినిధి, జూన్ 13(ప్రజా బలం) రూపాయి ఖర్చుపెట్టకుండా కాలంగడిపి తీరా రోల్లవాగు ప్రాజెక్టు పూర్తి దశలోకి రాగానే విమర్శలకు దిగుతున్న జీవన్ రెడ్డి గతాన్ని గుర్తుచేసుకొని మాట్లాడాలని రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మంగళవారం చివరి దశలోకి వచ్చిన రోల్లవాగు ప్రాజెక్టు పనుల పరిశీలన, రైతులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రోల్లవాగు ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 136 కోట్ల ఖర్చుతో చేపట్టిందన్నారు. చివరి దశలోకి పనులు చేరాయని త్వరలోనే పనులు ముగుస్తాయని దింట్లో ఒక టీఎంసీ నీటి నిల్వ ఉంటుందని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురిలోని 25 గ్రామాలకు సాగు నీరందుతుందన్నారు. 20 వేల ఎకరాలకు సాగు నీరంది 25 గ్రామాలు సస్యశ్యామలం ఆవుతాయని మంత్రి చెప్పారు. మేమేమి చేశామన్న సోయి మరిచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారన్నారు. 2017 లో మంత్రి హరీష్ రావు రోల్లవాగు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏండ్లు రాష్ట్రంలో పరిపాలన చేసిందని అలాగే జీవన్ రెడ్డి మంత్రిగా పనిచేశారని మంత్రి అన్నారు. కానీ ఏనాడు రోల్లవాగు అభివృద్ధిపై జీవన్ రెడ్డి ఆలోచించలేదని అన్నారు. కేవలం అధికార పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను చేపట్టిన అభివృద్ధి పనులను విమర్శించడమే పనిగా మారిందన్నారు. 1960 లో గుట్టల మీది నుంచి వచ్చి చేరిన నీటితో రోల్లవాగు ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నోసార్లు చేరువుకు బుంగ పడి నీళ్లు పోయినా పట్టించుకోలేదని చివరకు తుంగురు నర్సింహులపల్లె రైతులు కొట్టుకున్నా పరిష్కారంపై జీవన్ రెడ్డి ఆలోచన చేయలేదన్నారు. కానీ రోళ్లవాగు నీళ్లిస్తేనే ఓట్లడగాలని ఒకసారి రోళ్లవాగే అవసరమా అంటూ ఇంకోసారి జీవన్ రెడ్డి మాట్లాడడం భావ్యం కాదన్నారు. రోల్లవాగు పూర్తయితే 25 గ్రామాలకు సాగు నీరందుతుందని ఇది రైతులకు అవసరమని జీవన్ రెడ్డికి ఏమవసరమని మంత్రి ఎద్దేవా చేశారు. రోల్లవాగు ప్రాజెక్టును ఛాలెంజ్ గా తీసుకొని పనులను చేపట్టడం జరిగిందని మొదట 70 కోట్ల అంచనతో పనులు చేపట్టగా కరోన మూలంగా రెండేండ్లు పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రోల్లవాగు కట్ట తెగిపోతే అక్కడ కూడా జీవన్ రెడ్డి రాజకీయమే చేశారని కట్ట నిర్మాణం కోసం అధికారులను కలిసింది లేదన్నారు. ఒక లక్ష్యంతో రోల్లవాగు ప్రాజెక్టు ను చేపట్టామని చివరి దశకు పనులు చేరాయని జీవన్ రెడ్డి విషం చిమ్మే పనులు మాను కోవాలని మంత్రి ఈశ్వర్ సూచించారు. అనంతరం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ సాగు, తాగు నీటి అవసరాలకై రోల్లవాగు ప్రాజెక్టును చేపట్టడం జరిగిందన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కృషితో పనులు వేగవంతమై చివరి దశకు రోళ్లవాగు పనులు చేరాయన్నారు. 10 వేల కరెంట్ స్తంబాలతోపాటు కొత్త ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోల్లవాగులో 40 తట్టల మట్టి తీయలేదు కానీ జీవన్ రెడ్డి రోజు రోల్లవాగు పై మాట్లాడుతారన్నారు. వాస్తవానికి రోల్లవాగు ప్రాజెక్టు కావడమే ఎవరికి ఇష్టం లేదేమోనని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. అభివృద్ధికి సహకరించాల్సిన జీవన్ అభివృద్ధి పనులను అడ్డుకోవడం బాధాకరమన్నారు. గతంలో రోల్లవాగుకై గణేష్ పల్లిలో భూసేకరణకు పోతే అక్కడి ప్రజలను కొందరు కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టారన్నారు. నీళ్లు వచ్చాకే ఓట్లు అడగాలని జీవన్ రెడ్డి అనడం ఆయన స్థాయికి సరికాదన్నారు. నేనాడుగుతున్నా పోచంపల్లి ప్రాజెక్టు లోకి నీళ్లు తెచ్చాకే ఓట్లు ఆడిగారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గంతెందుకు పోచంపల్లి ప్రాజెక్టు కట్టిన నెహ్రు, ఇందిరమ్మలనే బండ భూతులు తిట్టిన జీవన్ రెడ్డి ఇందిర మరణంతో కాంగ్రెస్ లో చేరారన్నారు. ప్రాజెక్టు కట్టి నీళ్లు తెచ్చే ఆలోచనలు మావని కాంగ్రెస్ పార్టీ వారిలా కాలువలు తవ్వి ప్రాజెక్టులను మరిచిపోమన్నారు. తుమ్మిడి హట్టి ప్రాజెక్టు లేదు కానీ కాలువలు తవ్వారని పోలవరం ప్రాజెక్టు కాకముందే కాలువలు తవ్వడంతో అవికాస్తా పిల్లలకు క్రికెట్ గ్రౌండ్ అయ్యాయని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. 9 ఏండ్లు గడిచినా పోలవరం పూర్తి కాలేదని మూడేండ్లలో కాళేశ్వరం పూర్తిచేసుకొన్నామని రివర్స్ పంపింగ్ తో నీరొస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పటికైనా జీవన్ రెడ్డి తప్పుడు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హితబోధ చేశారు. అనంతరం జడ్పి చైర్మన్ దావా వసంత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కెడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రాంచందర్ రావు, జిల్లా, మండల రైతు బందు సమితి కన్వీనర్ కొలుముల రమణ, రాజేశం, ఎస్.ఈ. జి అశోక్, మాజీ జెడ్పీటీసీ శంకర్, మాజీ మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు నారపాక రమేష్, సర్పంచుల ఫోరం అధ్యక్షలు మహిపాల్ రెడ్డి, సర్పంచ్ శిల్ప రమేష్, ప్రధాన కార్యదర్శి శీలం రమేష్, సోషల్ మీడియా కన్వీనర్ వినోద్, ఉప అధ్యక్షులు శ్రీనివాస్ రావు, సర్పంచుల,ఎంపీటీసీ లు,ఉప సర్పంచులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అధికారులు
,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking