మొదటి విడతగా రెండు లక్షల రూపాయల చెక్కు అందజేత
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 13 : కోకాపేటలో నిర్మిస్తున్న పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం బేరి విక్రమ్ డాక్టర్ హరిప్రకాష్ సంయుక్తంగా ఐదు లక్షల రూపాయల విరాళం గురువారం రోజున ప్రకటించారు.మొదటి విడతగా రెండు లక్షల రూపాయల చెక్కును విక్రమ్ – అనూష దంపతులు గురువారం ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్ కు అందించారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్ చుంచు ఉషన్న, పెరిక విద్యార్థి వసతిగృహం అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి అచ్చా రఘుకుమార్, పెరిక కుల పరపతి సంఘం అధ్యక్షులు అందే శ్రీనివాస్ పాల్గొన్నారు.బేరి ఓవర్సీస్ పేరిట విక్రమ్ తార్నాక లో ఫారిన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నడుపుతున్నారు. ఆర్థోపెడిక్ సర్జన్ అయిన డాక్టర్ దిడ్డి హరి ప్రకాష్ కిమ్స్ లో సేవలు అందిస్తున్నారు.ఈ సందర్బంగా విక్రమ్,హరిప్రకాష్ లకు పెరిక సంఘం నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.