మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 13:
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అనధికారిక లేఔట్ల ప్లాట్స్ క్రమబద్దీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించిన కలెక్టర్ గౌతమ్.
ఈ రోజు 13-03-2025 న నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డు ఆఫీసర్లతో ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియపై ఆరాతీసి , ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఏ విదంగా చేస్తున్నారు, మొబైల్ ఆప్ ద్వారా అప్లికేషన్ నంబరు , పేరు , మొబైల్ నెంబర్ మొదలగు వివరాల ద్వారా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి రుసుము చెల్లించిన దరఖాస్తుదారులకు ప్రభుత్వ నిబంధనల మేరకు క్రమబద్దీకరణ కాపీలను వీలైనంత తొందరగా అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు, దాని వలన ప్రజల్లో నమ్మకం కలిగి మిగితా వారు కూడా రుసుము చెల్లించడానికి ముందుకొచ్చే అవాకారం ఉందని తెలిపారు.
అప్లికేషన్లను క్రమబద్ధమైన మాపింగ్ చేసి ప్రతి ఒక్క వార్డు ఆఫీసర్లు నిర్ణీత వ్యవధిలో నిర్ధేశించిన ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈ నెల 31లోగా క్రమబద్దీకరణ రుసుము చెల్లించినట్లయితే ప్రభుత్వం 25 శాతం రాయితీ అందిస్తుందని దరఖాస్తుదారులకు వార్డు ఆఫీసర్లు తెలపాలని ఆ దిశగా జిల్లాలోని మున్సిపల్ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ సిబ్బందిని కలెక్టరు ఆదేశించారు. ఈ క్రమంలో ప్రతిరోజు క్రమబద్దికరణ దరఖాస్తుల పై పురోగతిని, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు కారణాలు తెలపాలని సూచించారు. ఎల్ ఆర్ ఎస్ హెల్ప్ డెస్క్ లో వచ్చే ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకొని సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
సాంకేతిక సమస్యలద్వారా వచ్చే ఇబ్బందులను అధిగమిస్తూ ఈ ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించారు.
ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూలు చేసే ప్రక్రియ వేగవంతం చేసి నిర్ధేశించిన లక్ష్యాన్ని అధిగమించాలని కోరారు.
వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి కార్పొరేషన్ పరిధిలో యూనిఫామ్ టాక్స్ పద్దతిని అమలు పర్చడానికి కృషి చేయాలనీ అందుకు కాను తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా కంచె నిర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మునిసిపల్ కమీషనర్ షబ్బీర్ అలీ , బాచుపల్లి ఎం ఆర్ ఓ ఫూల్ సింగ్ , మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.