ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 13 :
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కి చెందిన సీనియర్ కరాటే మాస్టర్ భూమయ్య నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురికాగా నడుము భాగంలో బలమైన గాయాలు తగిలాయి. వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారని ఆపరేషన్ ఖర్చు 2 లక్షలు అవుతాయన్న విషయం తెలుసుకున్న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు 25000 రూపాయలు వసూలు చేసి మందమర్రి లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కోశాధికారి కనపర్తి రమేష్ చేతుల మీదుగా ఈ మొత్తాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు నాగలక్ష్మి, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్, సీనియర్ మాస్టర్ లు హరికృష్ణ, సరేష్, ప్రసాద్, రమేష్ రాజా, రవి, రాజేష్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.