జాతీయ బాలికల దినోత్సవంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 24:
బేటీ బచావో… బేటీ పడావో కార్యక్రమాన్ని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని బాలికల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమాధికారి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో 14వ జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమన్ని ప్రారంభించారు. అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, మాట్లాడుతూ… బాలికలకు ఉండే హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకారం వంటి అంశాలపై అవగాహనా కలిగిస్తూ దేశంలో బాలికలను ముందుకు నడిపించేందుకు బాలికల సంఖ్యను పెంచేందుకు, వారికి తగిన రక్షణ, ఆరోగ్యకర వాతావరణం కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరించారు. “భేటీ బచావో భేటీ పడావో “అనే పథకంతో దేశ వ్యాప్తంగా బాలికల రక్షణ, చదువు దిశగా ప్రయత్నిస్తుందన్నారు. బాలికల సంక్షేమం కోసం జరుగుతున్న కార్యక్రమాలను మరింత ముందుకి తీసుకెళ్తుందని తెలిపారు. అనంతరము బాలికలు సమాజానికి మణిహారం, బాలికలకు రక్షణ కల్పిద్దాం వారి బంగారు భవితకు పునాది వేదం స్వేచ్ఛా యుతమైన వాతావరణం మరియు పోషకాహారం అందించి వారి అభివృద్ధికి తోడ్పడుదాం బాలికలను బ్రతకనిద్దాం, చదవనిద్ధం 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేద్దాం మన వంతు సహాయం అందించి బంగారు తెలంగాణకు బాటలు వేద్దామని అదనపు కలెక్టర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యుసీ కమిటీ ఛైర్పర్సన్ రాజారెడ్డి, కమిటి సభ్యులు, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ రఘునాథ్ స్వామి, జిల్లా విద్యా శాఖ అధికారులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు, రాచకొండ, సైబరాబాద్ షీ– టీమ్ అధికారులు, ఎన్జీవో, మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున సీడీపీవోలు, సూపర్వైజర్లు, మహిళా సాధికారత బృంద సభ్యులు, ఐసీపీఎల్, ఐసీడీఎస్ చైల్డ్ లైన్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. బాలికల దినోత్సవం వారోత్సవాలలో వివిధ పాఠశాలలు, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లో నిర్వహించిన వివిధ పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.