సమగ్ర శిక్ష,పిఎం.శ్రీ నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులను కల్పించాలి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

సమగ్ర శిక్ష,పిఎం.శ్రీ నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులను కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం హైదరాబాదు నుంచి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన సమగ్ర శిక్ష, పి.ఎం.శ్రీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ, పాఠశాలల్లో అవసరమగు మౌలిక సదుపాయాలన్నీ సమకూర్చుకోవాలన్నారు. జిల్లాలకు విడుదలైన నిధులు, నిధులతో చేపట్టిన పనులు,మిగిలి ఉన్న నిధులకు సంబంధించిన వివరాలను కలెక్టర్ లను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో సివిల్ వర్క్స్,క్రీడా సామాగ్రి, విద్యార్థులచే పలు కార్యక్రమాల నిర్వహణకు ఈ నిధులను వినియోగించాలన్నారు.జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ,పి ఎం సమగ్ర శిక్ష నిధుల ద్వారా ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల్లో పలు కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు క్రీడోపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేలా ప్రత్యేక సామగ్రి కొనుగోలు చేయాలన్నారు.సమగ్ర శిక్ష, పీఎం.శ్రీ నిధులను వినియోగిస్తూ పాఠశాలల్లో పలు రకాల ప్రత్యేక దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఈవో పి.రామారావు, ఏఎస్ సి లింబాద్రి,విద్యాశాఖ అధికారులు రాజేశ్వర్, వెంకటరమణ,శ్రావణి లు,నర్సయ్య, మహేష్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking