విధులు బహిష్కరించిన న్యాయవాదులు

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి14 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని సివిల్ జూనియర్ కోర్టు న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ… రంగారెడ్డి జిల్లా న్యాయమూర్తి పై చెప్పు విసిరి దాడి చేసిన ఘటన అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకు న్యాయమూర్తులకు రక్షణ కల్పించాలని వారు కోరారు. దాడికి పాల్పడిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking