మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

 

ప్రజా బలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 14:
కుంభమేళాకు వెళ్ళి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అండగా ఉంటామని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఈటల రాజేందర్ పరామర్శించారు. మృతులు రవి, మల్లారెడ్డి, శశికాంత్, సంతోష్ టీవీ ప్రసాద్ కుటుంబాలను నాచారంలో ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించి సంతాపం తెలియజేశారు.ఈ సందర్భంగ ఈటల రాజేందర్ మాట్లాడుతూ యాక్సిడెంట్ లో చనిపోయిన కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తో మాట్లాడి మృతి చెందిన కుటుంబ సభ్యులకు తగిన పరిహారం అందేవిధంగా కృషి చేస్తామన్నారు. వారికి అండగా ఉంటూ మా వంతు సహాయం కూడా చేస్తామని మృతుల కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఏనుగుల సుదర్శన్ రెడ్డి
వై సత్యనారాయణ, మర్రి మోహన్ రెడ్డి, రవి నాయక్ మల్లెల నరసింగ్ రావు, రాగిరి మోహన్ రెడ్డి రవీందర్ రెడ్డి, అనిత పద్మారెడ్డి,ప్రకాష్, నాచారం డివిజన్ అధ్యక్షులు నవీన్ కుమార్, అభిషేక్ గౌడ్ అంజి, రాఘవేంద్ర రెడ్డి, రవికాంత్, ఉదయ్, అమర్, వరలక్ష్మి, బాలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking