ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ నియోజకవర్గం ఫిబ్రవరి 14:
సేవలాల్ మహారాజ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రభుత్వ విప్ డా.రాంచంద్రునాయక్ సూచించారు. గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో 2కె రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ మాజీ మంత్రివర్యులు రవీందర్ నాయక్ అమర్ సింగ్ తిలావత్,అతిధులుగా స్టేట్ టాక్స్ జాయింట్ కమిషనర్ అమర్ నాయక్, డిప్యూటీ కమిషనర్ భీమ్లా నాయక్, హెచ్పీసీఎల్ మేనేజర్ మంగీలాల్ నాయక్, డిఈ బాలాజీ రాథోడ్, కార్పొరేటర్ సుమన్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.రాంచంద్రు నాయక్ మాట్లాడుతూ సేవలాల్ మహారాజ్ జీవితం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మంచి విషయాలను చెప్పారని ఆయన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు. ఆయన జీవితాంతం బంజారాల అభివృద్ధికై త్యాగం చేశారన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజంలో అందరూ బాగుండాలని కోరుకున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం కాపాడు కోసం ఉదయం ఒక గంట సేపు వ్యాయామం చేయాలని సూచించారు. మాజీ మంత్రి రవీందర్ నాయక్, అమర్ సింగ్ తిలవత్ లు మాట్లాడుతూ సేవలాల్ మహారాజ్ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని,జాతీ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ నడుంబిగించి ముందుకు సాగాలని కోరారు. గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ మాట్లాడుతూ సేవలాల్ మహారాజ్ జీవిత చరిత్రను అన్ని వర్గాల విద్యార్థులు ప్రజలు చదివి మంచి విషయాలను గ్రహించి వారి జీవితంలో వాటిని పాటించి ప్రతి ఒక్కరు గొప్పగా జీవించాలని కోరారు. అతిధులు రన్ లో విజేతలుగా నిలిచిన వారికి మెడల్ తో సత్కరించి,నగదు బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బు నాయక్,ప్రధాన కార్యదర్శి విజయ నాయక్,రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ రమేష్ రాథోడ్, రాష్ట్ర కోఆర్డినేటర్ నందు నాయక్,పిడి ప్రకాష్ రాథోడ్, రెజ్లింగ్ కోచ్ జైపాల్ నాయక్, ఓయు అధ్యక్షులు హనుమంతు నాయక్, సతీష్ నాయక్, ప్రవీణ్ నాయక్, నరేందర్ నాయక్, హరి నాయిక్, రాజశేఖర్ నాయక్, మరియు తదితరులు పాల్గొన్నారు.