హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్.
– వైరల్,డెంగ్యూ పట్ల అశ్రద్ధ వహించకండి.
– విష జ్వరాల రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
– నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ దవాఖానలో సౌకర్యాలు మెరుగుపచాలని ఆదేశాలు.
హుజురాబాద్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 24
కరీంనగర్ జిల్లాలో డెంగ్యూ,విష జ్వరాలు విపరీతంగా పెరుగుతున్నందున హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలో సౌకర్యాలు మెరుగుపరిచి అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు జమ్మికుంట ఆసుపత్రికి 15 లక్షల హుజురాబాద్ ఆసుపత్రికి 15 లక్షలు కలిపి 30 లక్షలు ఇప్పటికే మంజూరు చేశామని,రాబోయే రోజుల్లో మరింత నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని తెలిపారు.విష జ్వరాలు అధికంగా వ్యాపిస్తున్నందున ప్రజలందరూ తమ ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశించామని వారు తెలిపారు.