తెలంగాణ హక్కుల రికార్డుల చట్టం 2024 రూపకల్పనకు అభిప్రాయ సేకరణ

 

మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 24:
రాష్ట్రప్రభుత్వం ధరణి సమస్యల ను పరిష్కరించేందుకు గాను తెలంగాణ హక్కుల రికార్డుల చట్టం 2024రూపకల్పనకు అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో హర్షనియమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం అభిప్రాయపడ్డారు.
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన తెలంగాణ హక్కులరికార్డుల చట్టం 2024 ముసాయిదా పై చర్చ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ 1971 లో ఆర్ఓఆర్ చట్టం వచ్చింది, 1989 నుండిఈ ఇదే చట్ట ప్రకారం పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా భూ పంపిణీ చేయడం జరిగిందన్నారు. 2020 వరకు కూడాఈ చట్ట ప్రకారం రెవెన్యూ శాఖ వ్యవహరించిందన్నారు. కోర్టులలో కూడాఈ చట్ట నిబంధనల మేరకు కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. అక్టోబరు 2020 నుండి ధరణి పోర్టల్ ద్వరా ఆన్ లైన్ ద్వారా అప్ డేషన్ చేయడమైందన్నారు. ధరణిలో రిజిస్ట్రేషన్ అయిన వెంటానే జాప్యం లేకుండా పాసుపుస్తకం అందించేవారని, కాని కొన్ని సమస్యలు ఎదుర్కోవడం జరిగిందన్నారు. తెలంగాణ హక్కుల రికార్డుల చట్టం 2024 రూపొందించడానికి గానురాష్ట్రమంతటా అభిప్రాయ సేకరణ జరిపించాలని ప్రభుత్వం ఆదేశించినందున, అందులో భాగంగాఈరోజు ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, నల్సార్ యూనివర్సిటి ప్రొఫెసర్లు, ప్రజాప్రతినిధులు, రైతులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు తెలంగాణ హక్కుల రికార్డుల చట్టం 2024బిల్లు లోని అంశాల పై సలహాలు, సూచనలు అందించాలని కోరుకున్నారు. అదేవిధంగా మీ అభిప్రాయాలను వ్రాతపూర్వకంగా కూడా అందించాలని కలెక్టరు తెలిపారు. సేకరించిన మీ అభిప్రాయాలను క్రోడికరించి ప్రభుత్వానికి నివేదక అందజేయడం జరుగుతుందన్నారు.
సురేష్ పొద్దార్ వికారాబాద్ జాయింట్ కలెక్టరు రిటైర్డ్ తన అభిప్రాయాన్ని తెలుపుతూ గ్రామస్థాయిలో గ్రామ సభలు నిర్వహించాలని చిన్న చిన్న సమస్యలను తహాసీల్దారు స్థాయిలోనే పరిష్కరించాలని, మ్యూటేషన్ తప్పకుండా చేసిన అనంతరం పాసుబుక్కులు అందజేయాలని తెలిపారు. 1971 లోని భూ సంస్కరణ చట్టాలను బేస్ చేసుకొని ప్రజలకు, రైతులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా నూతన చట్టాలను రూపొందించాలని తెలిపారు.
డా.జి. మల్లీకార్జున్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నల్సార్ యూనివర్సిటి మాట్లాడుతూ భూ సంస్కరణలలో పట్వారీ సిస్టం చాలా పాతది, చాలా ఖచ్చితమైనది, ఈ పద్దతిలో చిన్న చిన్న పొరపాటు లు తప్ప ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి కావని తెలుస్తున్నది. నూతన చట్టాలను రూపొందించేప్పుడు గతంలో జరిగిన తప్పులను సవరిస్తూ సర్వే డిపార్టుమెంటు వాళ్ల సహాకారం తీసుకుంటు రికార్డులను తప్పులు లేకుండా సవరించి వాటి ద్వారా కొత్త చట్టాలను రూపొందించాలని అభిప్రాయపడ్డారు. రెవెన్యూ ట్రిబ్యులనల్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.
రవీంద్రబాబు, రిటైర్డ్ డిప్యూటి కలెక్టరు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ గ్రామస్థాయిలలో ఐఆర్ఓ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని, గ్రామాలలో జరిగే చిన్న చిన్న భూ సమస్యలను విఆర్ఓలు తహాసీల్దారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తారన్నారు. మ్యూటేషన్ తప్పనిసరిగా చేయాలన్నారు.
పి.అశ్విన్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నల్సార్ యూనివర్సిటి మాట్లాడుతూ చట్టాలను రూపొందించేప్పుడు స్పష్టమైన ఆదేశాలను పొందుపరచాలన్నారు . చట్టం తయారు చేసే వారికి చట్టం అమలు చేసేవారికి గ్యాప్ రాకుండా ఉండాలన్నారు. ఎవరి కోసం చట్టాలు రూపొందిస్తున్నామో వారికి ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూ తగాదాలు కోర్టులలో పరిష్కారానికి చాలా కాలం పడుతుందని భూ సంస్కరణలకు సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నారు. అందులో జడ్జి,రెవెన్యూ ఉన్నతాధికారులను కమిటీలుగా ఏర్పాటు చేయాలన్నారు. గ్రామస్థాయిలలో ఉచితంగా సలహాలు, సూచనలు అందించేందు కస్టమర్ కేర్ సర్వీసును ఏర్పాటు చేయాలని సూచించారు. వీరే కాకుండాఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది,రైతులు, పాల్గొని వారి వారి సలహాలను సూచనలను కలెక్టరు గారికి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ హరిప్రియ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామ్మెహాన్, ఆర్డిఓలు, తహాసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking