భాగ్యవంతి టిఫిన్‌ సెంటర్‌ ప్రారంభించిన సొసైటీ ఫౌండర్‌ జె. మేరీ ఫ్లోరెన్స్‌

మల్కాజిగిరి ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్‌, మౌలాలి లో ఉన్నటువంటి పీపుల్‌ ఎంపవర్మెంట్‌ సొసైటీ తరుపున మల్లాపూర్‌, భవాని నగర్‌ లో సొసైటీ మెంబెర్స్‌ అయినటువంటి భాగ్యశ్రీ, శివకుమార్‌, జయశ్రీ, రాజు, రాజకుమార్‌ స్వయంకృషి తో ఎదిగి స్వంతం గా భాగ్యవంతి టిఫిన్‌ సెంటర్‌ ప్రారంభిచడం జరిగింది. ఈ ఓపెనింగ్‌ కి సొసైటీ ఫౌండర్‌ జె. మేరీ ఫ్లోరెన్స్‌ ని ముఖ్య అతిధిలుగా ఆహ్వానించటం జరిగింది.ఈ ఆహ్వానంకి జె. మేరీ ఫ్లోరెన్స్‌, జనరల్‌ సెక్రటరీ ఎస్‌. నాగలక్ష్మి వెళ్ళటం జరిగింది.ఈ కార్యాక్రమానికి విచ్ఛేసిన జె. మేరీ ఫ్లోరెన్స్‌, జనరల్‌ సెక్రటరీ ఎస్‌. నాగలక్ష్మి లకు పూలమాలవేసి సన్మానించడం జరిగినది.


భాగ్యవంతి టిఫిన్‌ సెంటర్‌ కి రిబ్బన్‌ కటింగ్‌ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా మేరీ ఫ్లోరెన్స్‌ వారికీ అభినందనలు తెలియచేస్తూ టిఫిన్‌ సెంటర్‌ మంచిది దిన దిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వారికీ అభినందనలు తెలియజేసారు.ఈ సందర్భంగా భాగ్యవంతి టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకులు మాట్లాడుతూ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్ఛేసిన సొసైటీ ఫౌండర్‌ జె. మేరీ ఫ్లోరెన్స్‌ ,జనరల్‌ సెక్రటరీ ఎస్‌. నాగలక్ష్మి లకు ధన్యవాదాలు తెలియజేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking