మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ను జగన్నాథ రథ యాత్ర లో ముఖ్య అతిథిగా పాల్గోనాలని కోరిన ఇస్కాన్ ప్రతినిధులు
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:ఇస్కాన్ అధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లో నిర్వహించనున్న జగన్నాథ రథ యాత్ర లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ని శనివారం హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో కలిశారు. రథ యాత్ర కు సంబంధించిన విషయాలను, ప్రాధాన్యతను వారు మంత్రికి వివరించారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.
