ఉచిత న్యాయసేవలను సమర్ధవంతంగా అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ఎస్‌. జగ్జీవన్‌కుమార్‌ పిలుపునిచ్చారు

ఉచిత న్యాయసేవలను సమర్ధవంతంగా అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ఎస్‌. జగ్జీవన్‌కుమార్‌ పిలుపునిచ్చారు. క్రిమినల్‌ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందించడానికి గాను ఏర్పాటు చేసిన నూతన వ్యవస్థ ‘‘లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం’’ను జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గదులను న్యాయమూర్తులు, సీనియర్‌ న్యాయవాదులతో కలిసి శుక్రవారంప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. అంతకు ముందు తెలంగాణ హైకోర్టులో నిర్వహించిన 17 జిల్లాల లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కార్యాలయాలను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ బి.విజయసేనారెడ్డిలు హైకోర్టులో ఈ కార్యాలయాలను ప్రారంభించగా 17 జిల్లాలలో ఆయా జిల్లాల న్యాయమూర్తులు ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమాన్ని న్యాయసేవాసదన్‌ సమావేశ మందిరంలో దృశ్య మాద్యమం ద్వారా న్యాయమూర్తులు, న్యాయవాదులు వీక్షించారు. ఖమ్మంలో డిఫెన్స్‌ కౌన్సిల్‌గా నియమితులయిన న్యాయవాదులు ఎం.హనుమంతరావు, ఎం.వలరాజు, టి.శ్రీనులను న్యాయమూర్తి అభినందించారు.
ఈ సందర్భంగా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి మహ్మద్‌ అబ్దుల్‌ జావేద్‌ పాషా మాట్లాడుతూ ఇదివరకు ప్రతి మెజిస్ట్రేట్‌ కోర్టులో న్యాయసేవలు అందించిన ఉచిత న్యాయ సహాయ న్యాయవాదులకు బదులుగా ఈ డిఫెన్స్‌ న్యాయవాధులు ఖమ్మం లోని అన్ని క్రిమినల్‌ కోర్టులలో అవసరమైన మరియు అర్హులైన ముద్దాయిలకు ఉచిత న్యాయసహాయం అందిస్తారని వారు వివరించారు.
కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎం.అర్చనా కుమారి, డి.రాంప్రసాదరావు, కె.ఆశారాణి, కె.దీప, వి.మాధవి, ఆర్‌.శాంతిలత, టి.గోపికా నాగ శ్రావ్య, సీనయర్‌ న్యాయవాదులు జహీర్‌ అలి, పోట్ల మాధవరావు, ఎం.మురళీదర్‌రావు, హెచ్‌.శ్రీరామారావు, వి.కృష్ణమూర్తి, ఎం.నిరంజన్‌రెడ్డి, బార్‌ అసోసియోషన్‌ అధ్యక్షులు దిరిశాల కృష్ణారావు, బార్‌ కార్యవర్గం మాదిరాజు లక్ష్మీనారాయణ, మన్నెపల్లి బసవయ్య, విజయరాఘవ, జె.ప్రవీణ్‌కుమార్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు కృష్ణమోహన్‌, శంకర్‌, జిల్లా కోర్టు పరిపాలనాధికారి ఎ.సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking