నాంపల్లి లో భారాసా నాయకుడు గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ వినూత్నంగా ర్యాలీ

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి: గోషామహల్‌ అసెంబ్లీ నియోజక వర్గంలో భారాసా అధిష్టానం పిలుపు మేరకు భాగ్యనగరంలో ఆత్మీయ సమ్మేళనలు జోరుగా సాగుతున్నాయి. నాంపల్లి లో భారాసా నాయకుడు , గ్రంధాలయ మాజీ చైర్మన్‌ గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ వినూత్నంగా ర్యాలీని నిర్వహించారు. నాంపల్లి కట్టెల మండి నుండి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ వరకు గుర్రం పై ఎక్కి వందలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు గత కొన్నాళ్లుగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనలు పార్టీ మరింత బలోపేతానికి , కార్యకర్తల ఐక్యతకు ఎంతో దోహదం చేస్తున్నాయని… మరోసారి ముఖ్యమంత్రి గా కేసీఆర్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking