ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 25 : ప్రజాస్వామ్యంలో అక్రమంగా వైయస్ షర్మిల అరెస్ట్ చేయడం సరైన కాదని మంచిర్యాల కో ఆర్డినేటర్ కారుకూరి సురేందర్ అన్నారు.మంగళవారం ఈ సందర్భంగా మంచిర్యాల కో ఆర్డినేటర్ కారుకూరి సురేందర్ మాట్లాడుతూ…వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అక్రమ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల నియోజకవర్గంలో ఉత్కుర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది,వైయస్ షర్మిల శాంతియుతంగా సీట్ అధికారులకు మన రాష్ట్రంలో ఉన్న ఖాళీ ఉద్యోగుల గురించి అప్లికేషన్ వెళ్లే సమయంలో వైయస్ షర్మిల ఇంటి వద్ద కేసీఆర్ ప్రభుత్వం పోలీసులను పంపించి పోలీస్ ల ద్వారా అక్రమంగా అరెస్టు చేసే సమయంలో పోలీసులు మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం సరైనది కాదు అని పశ్నీచారు, ముఖ్యంగా రాజ్యాంగం ప్రకారం మనం దేశంలో ఆర్టికల్ 14 ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది, అదేవిధంగా 14,21 పరంగా ఎవరికైనా ఇబ్బంది కలగకుండా తను పని చేసుకుంటా పోవచ్చు కానీ ఇక్కడ మన భారత దేశంలో నడుస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారిందని,అదికాకుండా షర్మిల చేసింది అంటే ఏమిటి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక పనులకు ప్రజా గంటక పనులకు వ్యతిరేకంగా మెమోరాండం ఇచ్చే సమయంలో ఈ పోలీసు వాళ్ళు వెళ్లి అక్రమంగా అరెస్టు చేసే సమయంలో కొత్త మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం జరిగింది,కానీ షర్మిల ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించిన పట్టించకపోగా ఆమె అడిగిన సమాధానం చెప్పకుండా అరెస్ట్ ఆర్డర్స్ చూపించకుండానే,పోలీసులు చెప్పకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని,ఈ ప్రభుత్వానికి పోలీసులకు,చట్టపరంగా పోతే అధికారులు లేక ప్రతిపక్ష నేతను అరెస్టు చేయాలంటే దానికి ఒక టెర్రరిస్ట్ లాగా అవసరం లేదని ప్రశ్నించారు, ఎందుకు ముందుగా వారెంట్ చూపిస్తూ అవసరం ఉండే కానీ ఇక్కడ అక్కడి పోలీసులకు వైయస్ షర్మిలను ఎందుకు అరెస్టు చేస్తున్నారో పోలీసులకు కూడా తెలియదు,ఈ పోలీసు వాళ్లు ప్రభుత్వానికి పాములు లాగా వాడుకుంటున్నారు,ఎందుకు అరెస్టు చేస్తున్నారని సమాధానం అడిగితే సమాధానం తెలియదు,పోలీస్ లకు పైనుంచి ఆర్డర్స్ అంటారు మాత్రమే పోలీస్ లకు కూడా తెలియదు అని ప్రశ్నించారు.మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి సుధారాణి,జిల్లా ప్రధాన కార్యదర్శి బోడో జితేందర్,జిల్లా కార్యదర్శి నీలం సంతోష్,సేవాదళ్ అధ్యక్షులు గాదే సాయికుమార్, నాయకులు కారుకూరి మల్లేష్,మోటపలుకుల కమలాకర్,బత్తుల వెంకటేష్,సౌటపల్లి వినోద్,తదితరులు పాల్గొన్నారు.