వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 25:
ప్రకృతి సౌందర్యాలకు మరింత శోభనిచ్చేలా, పల్లెలకు కొత్తదనం తెచ్చేలా తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కృత నిచ్చాయం తో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. “పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి, పల్లెలు ప్రశాంతతకు నిలయాలు అన్నట్లుగా పల్లెలను తీర్చి దిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. గ్రామాల రూపురేఖలను మార్చే దిశగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినారు. పల్లెల్లో ఉద్యానవనాల అభివృద్ధికి చొరవ చూపెట్టడంతో నేడు పల్లెలు పచ్చటి సోయగాలతో కాంతులీనుతున్నాయి. గ్రామంలో పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం రెండేళ్ల క్రితం గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పల్లె ప్రకృతి వనాల్లోని మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగి ఊరు మొత్తం పచ్చదనం సంతరించుకున్నాయి. పల్లె ప్రకృతి వనాల ప్రాంతంలో ఒకప్పుడు అపరిశుభ్రతతో పొదలు, చెత్తతో నిండి ఉండేవని, ప్రస్తుతం పల్లె ప్రకృతి వనాలు ప్రకృతిని పరవశింప జేసేదిగా ఉన్నాయని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనం ఉండాలన్న లక్ష్యంతో జిల్లా లో 576 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు. పల్లె ప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు ఇప్పుడు ప్రజలను ఆకట్టుకుంటున్నాయనడంలో మరే సందేహం లేదు. గ్రామీణ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంపొందించడానికి జిల్లాలోరూ. 3.45 కోట్ల వ్యయం తో 576 పల్లె ప్రకృతి వనాలను నిర్మించబడ్డాయాని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. వరంగల్ జిల్లాలోని అన్నీ మండలాల్లో పల్లె ప్రకృతి వనాలు పూర్తి స్థాయి లో వృద్దులకు ,యువకులకు వాకర్స్ ట్రాక్ గా ఉపయోగంలోకి వచ్చాయని ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అధికారులు తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నారు. వరంగల్ జిల్లా లోని సంగెం మండలం రామచేంద్ర పురం గ్రామ పల్లె ప్రకృతి వనం అద్బుతంగా నిర్మించడం .పట్టణాలకు, నగరాలకు పరిమితమైన పార్కులు ప్రస్తుతం పల్లెల్లోనూ కనువిందు చేస్తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ,ఎమ్మెల్యే చల్లా ధర్మ రెడ్డి సహకారం తో గ్రామభివృద్ధి జరిగింది. గత సంవత్సరం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖా ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గ్రామాన్ని సందర్శించి గ్రామం లో చేపట్టినఅభివృద్ధి సేవా కార్యక్రమాలను చూసి గ్రామం లోని అన్ని వాడలకు సిసి రోడ్లకోసం రూ కోటి 80 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతి నిధులు ఇచ్చిన సలహాలు, సూచనలు గ్రామభివృద్ధికి తోడ్పాటును అందించాయని సంగెం మండలం, రామచేంద్ర పురం సర్పంచ్, బొంపల్లి జయశ్రీ దిలీప్ రావులు పేర్కొన్నారు.