లక్షెట్టిపేట పట్టణంలో ‘భారత్ బంద్’ విజయవంతం

 

వర్గీకరణ వద్దు కలిసి ఉంటే ముద్దు

మాల మహానాడు మండల అధ్యక్షుడు గరిసె రవీందర్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 21 : పట్టణంలో ‘భారత్ బంద్’ విజయవంతం. బహుజనులంతా ఐక్యంగా ఉండాలని,వర్గీకరణ వద్దని కలిసి ఉంటే ముద్దని మాల మహానాడు మండల అధ్యక్షుడు గరిసె రవీందర్ పేర్కొన్నారు.బుధవారం మండలంలో భారత్ బంద్ ను నాయకులతో కలిసి బందును విజయవంతం చేశారు. మఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… ఆగస్టు 1న భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆగస్టు 1న రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.2004లో ఐదుగురుతో కూడిన ధర్మాసనం ఎస్సీ,ఎస్టీల ఉపకులాల వర్గీకరణ సాధ్యం కాదని ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పించిందని గుర్తు చేశారు.ఇది ముమ్మాటికి సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావిస్తాలేమని,ఇది నరేంద్ర మోడీ తీర్పుగా భావిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా భారత్ బంద్ ను స్వచ్ఛందంగా ఆర్టీసీ, విద్యాసంస్థలు,ప్రభుత్వ రంగ సంస్థలు,ప్రైవేట్ రంగ సంస్థలు,వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు.మా న్యాయమైన రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దమ్మ నారాయణ,ఆసాధి పురుషోత్తం,భూపెల్లి మల్లేష్,మాలెం చిన్నయ్య, ప్రధాన కార్యదర్శి బైరం లింగన్న,పట్టణ అధ్యక్షుడు పెండెం రాజు,అలుగునూరి నరేష్,భైరం రవి,నరేష్, గుత్తికొండ శ్రీధర్,తొగరి అశోక్,రజలింగు,పెండం సత్తయ్య,తొగరి రాజు, మినుముల శాంతి,బన్న శ్రీనివాస్,మామిడి సందీప్, మంచాల కుమార్, డిష్ మల్లేష్,మామిడి రఘు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking