గురుకుల విద్యాలయం సందర్శించిన అధికారులు

 

హాస్టళ్ళలో పరిశుభ్రత పాటించాలి

మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 21 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని గురుకుల విద్యాలయంను సందర్శించి,అధికారులతో హాస్టళ్లు,స్కూళ్లలో పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్ పేర్కొన్నారు. బుధవారం లక్షెట్టిపేట పట్టణంలోనీ గురుకుల విద్యాలయాన్ని అధికారుల బృందం సందర్శించింది. మొదట పాఠశాల గదులను,పరిసరాలను, డార్మెటరీ గదులను,మెస్ పరిసరాలను పరిశీలించారు.విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. హెల్త్ రికార్డులను పరిశీలించారు.మెస్ లో సరుకులను పరిశీలించి, క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దన్నారు.డైనింగ్ హాల్, కిచెన్ గార్డెన్ నిర్వహించడానికి తగిన సూచనలు చేశారు. అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో,భోజన సదుపాయాల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రిన్సిపల్ కి,పాఠశాల సిబ్బందికి సూచించారు. సందర్శించిన వారిలో ఎంపీడీఓ సరోజ,ఎంపీవో శ్రీనివాస్,ఎంపీవో వెంకట రమణ లు ఉన్నారు.వారి వెంట ప్రిన్సిపల్ రమా కళ్యాణి,వైస్ ప్రిన్సిపాల్ మహేశ్వర్ రావు,హెల్త్ సూపర్ వైజాగ్,పల్లవి,కేర్ టేకర్ శివ ప్రియ, అసిస్టెంట్ కేర్ టేకర్ శ్రీమతి నాగలక్ష్మి ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking