వాహనాలను వేలంపాట వేసిన పోలీస్ అధికారులు .

 

మెదక్ ప్రజాబలం న్యూస్ :-
జిల్లా ఎస్.పి. శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో గుర్తించినటువంటి (103) Abandoned/Unclaimed/Unknown వాహనాలకు వేలం పాట నిర్వహించడమైనదని ఇట్టి బహిరంగ వేలం పాటలో 66 మంది పాల్గొన్నారని, ఇట్టి వాహనాలు వ్యక్తిగత వాడుకకు (personal use) నిషేదమని పేర్కొన్నారు. ఈ వేలం పాటలో మొత్తం 103 వాహనాలను 4 భాగాలుగా విభజించి మొదటి భాగంలో 31 వాహనాలను, రెండవ భాగంలో 31 వాహనాలను, మూడవ భాగంలో 31 వాహనాలను, నాలుగవ భాగంలో 10 వాహనాలగా వేలం వేయడం జరిగినది.
 మొదటి భాగంలోని 31 వాహనాలను వేలం పాటదారులు 1,45,000/- రూపాయలకు సొంతం చేసుకున్నారు,
 రెండవ భాగంలోని 31 వాహనాలను వేలం పాటదారులు 1,85,000/- రూపాయలకు సొంతం చేసుకున్నారు,
 మూడవ భాగంలోని 31 వాహనాలను వేలం పాటదారులు 2,00,000/- రూపాయలకు సొంతం చేసుకున్నారు,
 నాలుగవ భాగంలోని 10 వాహనాలను వేలం పాటదారులు 1,65,000/- రూపాయలకు సొంతం చేసుకున్నారు,
ఈ Abandoned/Unclaimed/Unknown 103 వాహనాలకు గాను వేలం పాటలో 6,95,000/- రూపాయలు వచ్చాయని ఇట్టి డబ్బులను ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసినారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ శ్రీ. ఎస్. మహేందర్ గారు, సాయుద ధల డి.ఎస్.పి. శ్రీ.రంగ నాయక్ , ఆర్.ఐ.శ్రీ. శైలేందర్ , మెదక్ రూరల్ సి.ఐ శ్రీ.రాజశేఖర్ రెడ్డి గారు, ఆర్.ఎస్.ఐ.లు శ్రీ.నరేష్ గారు, శ్రీ.భవానీ కుమార్ గారు, శ్రీ.మహిపాల్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

   

Leave A Reply

Your email address will not be published.

Breaking