ఎస్సీ వర్గీకరణ తీర్పు రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం: ప్రభాకర్

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 21:
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉపకులాల వర్గీకరణకు సర్వోన్నత న్యాయస్థానం అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం భారత్ బంద్ నిర్వహించినట్లు బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, దీనిని పునః పరిశీలించాలని డిమాండ్ చేస్తూ ఈసీఐఎల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఎస్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఇచ్చిన నిరసన పిలుపుమేరకు తాము కూడా భారత్ బంద్ కు తమ పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమైన తీర్పునిచ్చిందని ఆయన ఆరోపించారు.ఎస్సీ వర్గీకరణ రద్దు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్, మల్లేష్, శ్రీ హరి నాయక్ జిల్లా ఇన్చార్జి గౌడ సుదర్శన్, .కుమార్, జంగయ్య,అనిత రెడ్డి,, ఉప్పల్ అధ్యక్షుడు శివకుమార్, ఉప్పల్ ప్రధాన కార్యదర్శి మింత్రాల నర్సింగరావు, మందార బాబు తదిరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking