ఆకారపు గుడిలో కాశీనాధునికి భస్మ హారతి

బారులు తీరిన భక్తులు

ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చే 8:

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చరిత్ర ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కాలం నాటి కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం (ఆకారపు వారి గుడి)లో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం 4 గంటల నుండి కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ఆలయ ప్రధాన అర్చకులు లంక శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో మహాదేవునికి అభిషేకాలు అర్చనలు ఘనంగా నిర్వహించారు. పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర వివిధ రకాల పళ్ళ రసాలతో చేసిన అభిషేకాలు శివదేవునికి చేరాయా అన్నట్లుగా ఘనంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టి, ఫౌండర్, ఆకారపు హరీష్ స్వాతి దంపతులు దగ్గరుండి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. బారులు తీరిన భక్తులు ఒక్కొక్కరుగా స్వామివారికి వారి మనోవంచలు నెరవేరలని కోరుతూ అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 6:45 నిమిషాలకు మహాదేవునికి చేపట్టిన భస్మహారతి ప్రత్యేకంగా ఆకట్టుకుందని చెప్పాలి ఈ భస్మ హారతిని వీక్షించటానికి భక్తులు పోటీపడ్డారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ వెంకట్రావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking