మణికొండ శ్రీరాంనగర్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌ లో శివోహం ఆర్ట్‌ క్యాంప్‌

రాజేంద్ర నగర్‌ ప్రజా బలం ప్రతినిధి 09 మార్చ్‌ 2024: కాళిపట్నం ఆర్ట్స్‌ అకాడమీ వారు గత 8 సంవత్సరములుగా శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న శివోహం ఆర్ట్‌ క్యాంప్‌ ఈ దఫా కూడా మణికొండ శ్రీరాంనగర్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌ లో ప్రపంచ స్త్రీల దినోత్సవం సందర్భంగా సుమన్‌ టీ.వీ సీ.ఈ.ఓ నిరుపమ ద్వారా ప్రారంభించ బడిన కార్యక్రమంలో ప్రముఖ చిత్ర కారిణీలు 16 మంది చిత్ర కారులు 16 మంది పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయమని నిర్వాహకులు కాళీపట్నం ప్రతాప్‌ తెలియ చేయడం జరిగినది, ఈ శుభ సందర్భంగా శ్రీరామ్‌ నగర్‌ కాలనీ అధ్యక్షుడు మనోహర్‌, సంఘ సభ్యులు, వీ.ఆర్‌.ఫర్‌ సహయోగ చారిటబుల్‌ ట్రస్టు సభ్యులు అందె లక్ష్మణ్‌ రావు, దిలీప్‌ కక్కడ్‌, 64కళలు.కామ్‌ ఎడిటర్‌ కళాసాగర్‌, సినీ వినోదం.కామ్‌ ఎడిటర్‌ రాంబాబు, బాపూజీ బత్తుల తది తరులు పాల్గొన్నారు, ఆదివారంతో ముగియనున్న ఈ కార్యక్రమంలో ఉదయం 10 నుండి మధ్యాణం 1 వరకు ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్టు అందులో రావుస్‌ ఈ.ఎ.న్టీ జీవీస్‌ రావు, శ్రీరామ్‌ క్లినిక్స్‌ ఎముకల డాక్టర్‌ శ్రీనివాస్‌ బోగ, ఏ.ఎం క్యూర్‌ హాస్పిటల్‌ జనరల్‌ మరియు మధు మేహా డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆదిత్యా, గైనిక్‌ డాక్టర్‌ దివ్యా బట్చూ, అక్షయ డెంటల్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌, మెడ్కేర్‌ హాస్పిటల్‌ వారి కార్డియాలజీస్ట్‌, మధు మేహా రక్త పరీక్ష, ఫస్ట్‌ కేర్‌ ఫార్మసీ వారిచే బీ.పీ, ఎత్తు, బరువు, బీ.ఎమ్‌.ఐ పరికరంతో ఉబకాయం, క్రొవ్వు అనాలిసిస్‌ పరీక్షలు చేస్తారని ఈ సదవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగ పరచు కోవాలని హెల్త్‌ క్యాంప్‌ బృందం ఆర్గనైజర్‌ బి. శివరామ కృష్ణ తెలియ జేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking