ఖమ్మం ప్రతినిధి మార్చి 9 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో మన ఊరు మనబడి పథకం లో భాగంగా నేలకొండపల్లి మండలం పైనంపల్లి పాఠశాల లో జరిగిన పనుల్లో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించలేదు 20 లక్షల రూపాయల తో పాఠశాల లో వివిధ రకాల పనులు చేపట్టారు.అప్పటి ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఆశీస్సులతో కాంట్రాక్టు పొందిన వ్యక్తి పనులను నాసిరకంగా చేసాడు దీంతో కొద్ది రోజుల కే నీళ్ల ట్యాపు ల తో పాటు పైపులు కూడా పగిలిపోయి పాఠశాల అంతా బురద మయంగా మారుతుంది అధికారులు కూడా కాంట్రాక్టర్ కు వంతపడటం తో 20 లక్షల రూపాయల పనులు ఇష్టారాజ్యంగా చేసాడు ఇలాంటి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని ప్రభుత్వ సొమ్మును రికవరీ చెయ్యాలని గ్రామస్తులు కోరుతున్నారు

