పంచ చలి వెంద్రాలను ఏర్పాటు చేస్తున్న వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి:
మణికొండలొ తిరిగే బాటసారులకు ఎండాకాలం భానుడి తీవ్రమైన ధాటిని తట్టుకొని, దాహార్తిని పోంది సెద తీరడానికి గాను వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టు వారు 9 చల్లని మంచి నీటి చలి వెంద్రాల ఏర్పాటుకు మునిసిపల్ కమీషనర్ అనుమతి గైకొని మొదటి దశగా 5 ప్రారంభోత్సవాలు: అలకాపురి రోడ్ 14 హైవ్ జంక్షన్ కూడలిలో, నెక్నంపుర్ బొడ్రాయి దగర, సెక్రెట్రియ్యేట్ కాలనీ గోల్డెన్ టెంపుల్ దారిలో గల ప్రతిభా స్కూలు ఎదురుగా, సుందర్ గార్డెన్: షిర్డీ సాయి/ శివాజీ నగర్ కూడలిలో, నరసింహ స్వామీ గుడి ఎదురుగా ఎల్.ఐ.సి కాలనీ బస్ స్టాండ్ ప్రక్కన అందరి సహకారంతో ఆదివారం రోజున ఏర్పాటు చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేసినామని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ జేస్తు ఇట్టి సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించు కోవాలని వినమ్ర వినతి గావిస్తు రెండవ దశగా మిగిలిన నాలుగు అతి తొందరలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయగలమని, ఈ శుభ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు, ప్రజా నాయకులు తది తరులు పాల్గొని కార్యక్రమాలన్నీ విజయ వంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking