పేకాట నిందితుల బైండోవర్

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 14 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం బలరావుపేట గ్రామ శివారులో ఈనెల 12న పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురు పేకాటరాయుళ్ళను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్సై సతీష్ శుక్రవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ప్రకారం పట్టుబడిన వారిని లక్ష రూపాయల పూచీకత్తుపై లక్షెట్టిపేట తహసీల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగిందన్నారు.బైండోవర్ చేసిన వారిలో బత్తుల రమేశ్, కోన తిరుపతి,బేర రాజయ్య, సంగ ఒధయ్య,గోర్క మల్లేష్, వనపర్తుల సుధాకర్,మండే సత్తన్నలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking