ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 14
లక్షెటిపేట లోని లిటిల్ స్టార్ గ్రామర్ స్కూల్ లో అమ్మానాన్న దీవెన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కరస్పాండెంట్ సంతపరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండే అమ్మానాన్నల యొక్క ప్రేమను గుర్తు చేయాలి.ప్రేమ అంటే ఇద్దరు యువతి యువకుల మధ్య కలిగేది మాత్రమే కాదు,తల్లిదండ్రుల ప్రేమ కూడా ఎంతో విలువైనది వెలకట్టలేనిది.విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క ప్రేమను తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరము అని అన్నాడు.ప్రేమికుల రోజున విద్యార్థులకు తమ తల్లిదండ్రులు ప్రేమను గుర్తుచేస్తూ పిల్లలకు అమ్మానాన్నల దీవెనలు అందించినందుకు కార్యక్రమం లో పాల్గొన్న పాఠశాల పోషకులు హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థులలో సృజనాత్మకత,క్రమశిక్షణ పెద్దలపై గౌరవ మర్యాదలు పెంపొందించుటకు కృషి చేస్తున్నటువంటి పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మహమ్మద్ హమీద్, మినుముల శ్రీనివాస్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.