అలేఖ్య కేసులో మిగిలిన వారికి కూడా శిక్ష పడాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జి. జానకీ షర్మిల ను కలిసిన బాధిత కుటుంబీకులు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..గత ఏడాది సంచలనం సృష్టించిన అలేఖ్య హత్య కేసులో నిందితుడైనటువంటి ఎ1 జూకింది శ్రీకాంత్ కు బుధవారం జీవిత ఖైదు పాటు రూ.1000 జరిమాన ను విధిస్తూ నిర్మల్ జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది , ఇందులో భాగంగా బాధితురాలి కుటుంబ సభ్యులు నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ ని కలవడం జరిగింది, ఎ1 కి మాత్రమే శిక్ష పడ్డది, కానీ అట్టి కేసులో హత్యకు కారణమైన ఎ2 మరియు ఎ3 లకు ఎలాంటి శిక్ష వేయకుండా వదిలేశారు అని వారికి కూడా సరైన శిక్ష విధిస్తేనే తమ కుటుంబానికి సరైనా న్యాయం జరుగుతుంది మరియు వారి వల్ల తమ కుటుంబానికి ప్రాణ హాని ఉంది అని ఎస్పీ గారితో బాధిత కుటుంబం పేర్కొనడం జరిగింది.వెంటనే ఎస్పి స్పందించి ఈ కేసు విషయం లో హైకోర్టు లో అప్పీల్ చేస్తాము అని హామి ఇవ్వడం జరిగింది