కామేపల్లి లో అయ్యప్ప స్వామి  జన్మదిన వేడుకలు

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 14 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి లోని సాయిబాబా ఆలయంలో అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా  కొండ్రు పుల్లయ్య స్వామి, ఆలయ పురోహితులు జానయ్య ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అయ్యప్ప జన్మదిన కార్యక్రమం సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.. తదనంతరం మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ కలిపురుషుని యొక్క ప్రభావం పడకుండా ఉండాలంటే భక్తి మార్గము,  తప్పక అనుసరించాలని,  అదే మనకు శరణ్యమని  తెలిపినఅయ్యప్ప స్వామి జన్మదిన వేడుక మరియు అట్టడుగు వర్గాల సామాజిక న్యాయం కోసం పోరాడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదినం ఇదే రోజు జరుపుకోవడం  చాలా శుభపరిణామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ళ రవి బందర్ బండి నరసింహారావు పాప్యా నాయక్ దొడ్డిగర్ల సుందరం,రాయల లక్ష్మయ్య, ముత్తెబోయిన రామ్మూర్తి,గండమాల వెంకన్న రాంబాబు, భాగం రామారావు, తంగళ్ళపల్లి  తిరపయ్య, చిలక వెంకన్న,బండి వెంకటేశ్వర్లుతదితరులు పాల్గొన్నారు.కామేపల్లి లో జరిగిన అయ్యప్పల అన్నదాన ప్రాంగణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నా మేకల మల్లిబాబు యాదవ్, రాంప్రసాద్ గురు స్వామి, పగడాల కిశోర్,తిరుపతి రావ్ గురు స్వామి పాల్గొన్నారు. కాగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి మల్లి బాబు యాదవ్ ను సన్మానం చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking