ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 14 : డా,బీ ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశానుసారం టీ షర్ట్స్ పంపిణీ చేశారు. శుక్రవారం లక్షెట్టిపేట మండలంలోని వెంకటరావుపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యూత్ సభ్యులు 40 మందికి “జై భీమ్” టిషర్ట్స్ బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నల్లమెల రాజు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నలిమెల రాజు మాట్లాడుతూ….అంబేద్కర్ భారతదేశానికి ఒక దిక్సూచి అని అన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు.మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశానుసారంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నలిమెల సత్తయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ యూత్ సభ్యులకు “జై భీమ్ టీషర్ట్స్ 40 మందికి పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ పోతురాజుల రామచందర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్,మాజీ వార్డు సభ్యులు డాక్టర్ మురళి,మెరుగు లింగన్న,కాంగ్రెస్ నాయకులు తోట శ్రీనివాస్,మీస పుల్లయ్య,అంబేద్కర్ యువజన సభ్యులు పాల్గొన్నారు.