పేదలకు అన్నదానం చేసిన పొనగంటి మల్లయ్య
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 16
జమ్మికుంట మాజీ సర్పంచ్, కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జన్మదినానికి పురస్కరించుకొని ఆయన అనుచరులు జమ్మికుంట పట్టణంలోని బొమ్మల గుడి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి,అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తూ అనేక పదవులను ఆరాధించిన పొనగంటి మల్లయ్య మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి మల్లయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు బోగోని వీరన్న, దిండి రాము, పొనగంటి సారంగం, కాంగ్రెస్ నాయకులు, పొనగంటి సురేష్ (జెమిని) దేశీని సదానందం, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.
