మెదక్ ప్రజా బలం న్యూస్ :-
తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు గజ్వేల్ నియోజకవర్గం లో ప్రాజ ప్రతినిధులు అన్ని మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రతాప్ రెడ్డి అభిమానులు సోషల్ మీడియా వాట్సాప్ ద్వారా చరవాణి ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్ సీఎం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో సర్పంచుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మనోహరబాద్ సర్పంచ్ చిట్కూల మహిపాల్ రెడ్డి రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లెడ్ డోనేషన్ చేశారు. అనంతరం ఎప్డీసి చైర్మన్ ప్రతాప్ రెడ్డికి ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపిపి పురం నవనీత రవీ ముదిరాజ్, సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి ప్రతాప్ రెడ్డి చిత్రపటాని ఆకర్షనీయంగా అందంగా తీర్చిదిద్ది ఎఫ్డిసి చైర్మన్ వంటేర్ ప్రతాప్ రెడ్డి కి అందజేశారు. తూప్రాన్ మండల జడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్ , కౌన్సిలర్లు కోడిప్యాక నారాయణ గుప్తా మామిళ్ల జ్యోతి కృష్ణ, నాయకులు కిష్టారెడ్డి, కాసిరెడ్డి , కుమ్మరి రమేష్ , శ్రీదర్ , దామోదర్ రెడ్డి, మన్నె శ్రీనివాస్, ఎస్కే బురాన్ భాయ్, దాశరథ బిఆర్ ఎస్ పార్టీ నాయకులు అయ్యప్ప స్వామి మందిరంలో విశేష పూజలు నిర్వహించి సాయిబాబా ట్రస్టులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకల్లో పాల్గొని శాలువాతో బొకేలతో సన్మానించి , సత్కరించి కేక్ కట్ చేసి ఆశేష జనవాహిని మధ్యన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం లోని ఉమ్మడి మెదక్ జిల్లా నుండి వివిధ సంఘాల మహిళలు, ప్రజా ప్రతినిధులు , వివిధ గ్రామ ప్రజలు, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు, ప్రభుత్వ అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.