కల్తీ కెమికల్స్ కల్తీ నూనెలతో
తినుబండారల తయారి..
ఆరోగ్యాలతో చెలగాటం…
మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ విచ్చలవిడిగా వెలసిన బిర్యాని హోటల్. తాజాగా గత మూడు నాలుగు రోజుల క్రితం కల్తీ బిర్యాని ఆహారాన్ని సేవించి 15 మంది అస్వస్థకు గురైనట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.. హోటల్ యజమానులు నాసిరకం కోళ్ల మాంసాన్ని మేక మాంసాన్ని తీసుకువచ్చి వంటకాలు తయారు చేస్తున్నారు. జనాలు ఆకలికి తాళలేక ఆహారాన్ని సేవించి అస్వస్థకు గురవుతున్నారు. మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ రంగులు కల్తీ నూనెలతో గుమ గుమలాడించే ఫాస్ట్ ఫుడ్ వంటకాలు తయారుచేసి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడు కుంటున్నారు. మున్సిపల్ బైపాస్ లో విచ్చలవిడిగా దాబాలు వెలిసాయి అందులో సైతం కల్తీ.. అదేవిధంగా తినుబండారాల దుకాణాలు గప్ చుప్ చాట్ బండారలలో కల్తీ కెమికల్స్ తో బజ్జీల కొట్టుల్లో కల్తీఫామాయిల్ తిను బండారాలను తయారు చేస్తూ జోరుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీని దృష్ట్యా రాష్ట్రంలో అక్కడక్కడ కల్తి ఫుడ్ సేవించి జనాలు దావాఖానాల పాలు అవుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం. హోటల్ యాజమాన్యాలు డబ్బులు దండుకోవడమే తప్పా ఆరోగ్య స్వచ్చమైన అహారంపైన దృష్టి లేకపోవడం సిగ్గుచేటు. ఇలాంటి కల్తీలతో ఆహార పదార్థాలు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతూ చెలగాటన్నీ చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకునే అధికారులు కరువయ్యారు. జనాలు సేవించే ప్రతి ఆహార పదార్థాలలో కల్తీలచే అట్టుడికి పోతున్న నిమ్మకు నీరెత్తిన అధికార యంత్రాంగ వైనం…..