భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విపత్కర సమయంలో సహాయం కోసం నిర్మల్ పోలీస్. మీ పోలిస్.క్షణాల్లో మీ వద్దకు జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల
24/7 పోలీసు సిబ్బంది అందుబాటులో
సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతం.
వర్షాల దృష్ట్యా నిర్మల్ జిల్లా పరిధిలోని ప్రజల కోసం జిల్లా ఎస్పీ ఈ రోజున ఒక ప్రకటనను విడుదల చేశారు.
రాగల 24-48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా పోలీస్ యంత్రంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని,ప్రజలు అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రాకూడదని ఎస్పీ గారు తెలిపారు.
పోలీసు యంత్రాంగం, శిక్షణ పొందిన పోలిస్ బృందం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి లేదా కంట్రోల్ రూమ్ 8712659555 కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని, అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ప్రజలు పోలీసు వారి సూచనలు సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు.
స్వర్ణ ప్రాజెక్టు , కడెం ప్రాజెక్టు, గడ్డెన్న వాగు ప్రాజెక్టు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండలని, వాగులు వంకలు పొంగి పొర్లె అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని వాటి వద్దకు వెళ్లావద్దన్నారు.
ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు,కాలువలు,నదులు, రిజర్వాయర్లు,చెరువుల వద్దకు వెళ్ళరాదు.
జలాశయాలు, చెరువులు,వాగుల,ప్రాజెక్టు ల వద్దకు మత్స్యకారులు,ప్రజలు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదు.
రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి,వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను గాని,వైర్లను గానీ చేతులతో తాకవద్దు.చెట్ల కింద,పాడైన భవనాలు కింద,శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు. విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదు.
ప్రతి పోలీస్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు,కుంటల అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల దగ్గర నీటి ప్రవాహం గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని, ప్రత్యేక్షంగా వెళ్లి పర్యవేక్షించి పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు.
వరద నీటికి చెరువులు, కుంటలు నిండి చెరువు కట్టలు తెగి పోయే ప్రమాదం ఉంటుంది. కావున ప్రజలు అప్రమత్తం గా ఉండగలరు.
వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించండి. వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి, గుంతలు ఏర్పడి అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది.కావున జాగ్రత్తగా,నెమ్మదిగా చూసుకొని ప్రయాణించండి.
వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదు అని సూచించారు.
నిర్మల్ పోలిస్.మీ పోలిస్ గా ఆపత్కాలంలో లో మీతో మీ సహాయం కోసం పనిచేయుటకు సిద్ధంగా ఉన్నారు అని ఎస్పి తెలియజేశారు