రైతులకు ఇబ్బంది లేకుండా ధరణి సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ధరణి సహాయ కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

 

ఖమ్మం ప్రతినిధి జులై 20 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాలోని రైతులకు ఇబ్బంది లేకుండా ధరణి సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ధరణి సహాయ కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ధరణి సహాయ కేంద్రమును శనివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిర్యాదు దరఖాస్తు నమోదు పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం ప్రజావాణిలో భూ వివాదాలకు సంబంధించి, ధరణి సంబంధిత సమస్యల పైనే ఎక్కువ మంది బాధితులు వస్తుండడంతో వాటిని పరిష్కారించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. కలెక్టరేట్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ధరణిలో తమ సమస్యలకు సంబంధించి రైతులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సహాయ కేంద్రం లో సమాచారం అందిస్తామని తెలిపారు. రైతు సమస్య ను తెలుసుకొని, దానికి ఏఏ పద్దతిలో అప్లై చేయాలి, ఏయే ఆధారాలను అందించాలనే విషయాన్ని సిబ్బంది వివరిస్తారు. అలాగే అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా రైతులు ప్రతి చిన్న పనికి పదే పదే అధికారుల చుట్టూ తిరగకుండా ఈ విధానాన్ని అమలుచేస్తున్నామని చెప్పారు. మీ సేవా కేంద్రాల ద్వారా రైతులు సరైన నమూనా లో దరఖాస్తు చేసుకోకపోవడం, దరఖాస్తుకు సంబంధించి సరైన ఆధారాలను చూపించక పోవడం వలన అధికారులు పరిశీలన సమయంలో వాటిని తిర్కరిస్తున్నారని దీంతో రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోందని, అందుకోసం దరఖాస్తు చేసే సమయంలోనే రైతులను సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్ లు ఉపయోగ పడుతాయని వివరించారు. ధరణి సహాయ కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉండేలా కంప్యూటర్ ఆపరేటర్ ను నియమించామని, అప్లై చేసుకునే విధానంతో పాటు, దరఖాస్తు చేసుకున్న తర్వాత అప్లికేషన్ల స్థితిగతులను ను కూడా తెలుసుకోవచ్చుని అన్నారు ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందనే కారణం కూడా సిబ్బంది చెప్పుతారని కలెక్టర్ తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking