పవన్ వ్యాఖ్యల కలకలం

మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌ కుటుంబాల మధ్య గ్యాప్‌ చాలా పెరిగిపోయిందన్న విమర్శలు బాగా పెరిగిపోయాయి. తాజాగా ఆయ్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అరవింద్‌కు బాగా నమ్మినబంటు బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు మరింత బలన్నిచ్చాయి.

పవన్ వ్యాఖ్యల కలకలం
ఆయ్‌ సినిమా ప్రమోషన్స్‌లో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు చెప్పిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో పాలకొల్లు నుంచి జనసేన తరఫున బన్నీ వాసు బరిలో దిగుతారని బాగా ప్రచారం సాగింది. ఇదే విషయాన్ని మీడియా అడగ్గా తనను పవన్‌ 2019లోనే పోటీ చేయమని కోరారని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల ముందు కూడా మరోసారి పవన్‌ను కలిసినప్పుడు పోటీ విషయం గుర్తు చేశారన్నారు. కానీ తాను అరవింద్‌గారిని అడిగా చెబుతా అన్నప్పుడు ఆయనకు అర్థమైపోయిందని … నువ్వు నీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయి వచ్చినప్పుడు రా అని పంపించేశారని బన్నీవాసు చెప్పారు. ఈ వీడియో సోషల్‌మీడియాల విపరీతంగా షేర్‌ అవుతోంది. బన్నీవాసు చెప్పిన విషయం చూస్తే…. అరవింద్‌ పేరు చెప్పగానే పవన్‌ రియాక్షన్ మారిపోయినట్లు తెలుస్తోంది. వాళ్లు, వీళ్లను అడిగి కాదు…నీ సొంతంగా నువ్వు నిర్ణయాలు తీసుకో అన్న హింట్ ఇచ్చినట్లు తెలిస్తోంది. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు మరసారి బహిర్గతమయ్యాయి..

మెగా కాంపౌండ్‌లో కనిపించని అరవింద్‌
శ్రీకృష్ణ అర్జున్‌లా ఎప్పుడూ కలిసిమెలిసి కనిపించే చిరంజీవి, అల్లుఅరవింద్‌ ఈ మధ్యకాలంలో పెద్దగా కలిసి కనిపించిన దాఖలాలు లేవు. ఎప్పుడు చూసినా చిరంజీవి ఇంట్లోనే ఉండే అరవింద్‌ ఇప్పుడు ఆ దరిదాపుల్లోకి కూడా రావడం లేదని తెలిసింది. ఈసారి ఎన్నికల్లో జనసేన అద్భుత విజయం సాధించడమేగాక..పవన్‌కల్యాణ్ డిప్యూటీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అన్న చిరంజీవి కుటుంబం ఆశీర్వాదానికి వచ్చినప్పుడు కూడా అల్లు కుటుంబ సభ్యులు ఎవరూ కనీసం కనిపించలేదు. కేవలం చిరంజీవి, నాగబాబు కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. అటు అరవింద్‌గానీ, ఇటు అల్లు అర్జున్‌గానీ కనీసం బహిరంగంగా పవన్‌ను వి‌ష్ చేయకపోవడం మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. ఈసారి జనసేన తరఫున తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది నటులు, చిన్నచిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం ప్రచారం చేశారు. మొత్తం ఇండస్ట్రీ పెద్దలు సైతం పవన్‌ గెలుపును కోరుకున్నారు. కానీ సొంత కుటుంబ సభ్యులైన అరవింద్ ఫ్యామిలీ మాత్రం ఎక్కడా ప్రచారం కాదుకదా..కనీసం పేపర్ స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking