ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జులై 20 : రైతు బీమా 7 వ పాలసీ సంవత్సరానికి గాను దరఖాస్తుకు ఆహ్వానం లక్షెట్టిపేట వ్యవసాయ అధికారి ప్రభాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…28 జూన్ 2024 వరకు ఎవరైతే ధరణి పట్టాదార్ పాస్బుక్ కలిగియున్నారు వారు రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.వయసు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య
ఉండవలెను పట్టాదరు 14. 8. 1965 మరియు 14. 8. 2006 మధ్య జన్మించి ఉండవలెను. గత సంవత్సరం రైతు బీమా పాలసీ ఉన్నవారు వ్యవసాయ శాఖచే రెనువలు చేయబడును మరలా వారు దరఖాస్తు చేయనవసరం లేదు
దరఖాస్తు చేసుకునే రైతులు దరఖాస్తు ఫారం తో పాటు పట్టాదారు పాసుపుస్తకం పట్టాదారు యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అదేవిధంగా నామిని యొక్క జిరాక్స్ జతపరిచి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి ఇవ్వవలెను దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 5 2024,సందేహాలకు వ్యవసాయ విస్తరణ అధికారులను మండల వ్యవసాయ అధికారి వ్యవసాయ శాఖను సంప్రదించగలరు.