ప్రజాబలం మణికొండ గండిపేట్* : ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దే నిర్దేశకులని మణికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్ కె.రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం మణికొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు వీడ్కోలు సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించి వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మణికొండ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎన్నో విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మార్కులు వచ్చాయన్నారు. ఇదే స్ఫూర్తితో వారు బదిలీపై వెళ్లే పాఠశాలల్లోనూ ఇవే ఫలితాలను విద్యార్థులకు అందించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు మల్లేష్, బాలకిష్టయ్య, చంద్రశేఖర్ రెడ్డి, మరో ముగ్గురు ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయులు నిరంజన్, కౌన్సిలర్ వసంత్ చౌహన్, నాయకులు బీరప్ప, ఏర్పుల కుమార్, గంగాధర్, శ్రవణ్, రాజేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.