బి.ఐ.ఎస్.యాప్ వినియోగదారుల సాధికారత సాధనం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 21 : ప్రతినిత్యం మార్కెట్లో లభించే అన్ని రకాల ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు తెలుసుకునేందుకు బి. ఐ.ఎస్.కేర్ యాప్ వినియోగదారులకు సాధికారత సాధనంగా ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్,బి.ఐ. ఎస్.శాస్త్రవేత్త సుజాత, ఎస్.పి.ఓ.అభిసాయి ఇట్ట లతో కలిసి నిత్య జీవితంలో వినియోగించే వస్తువులకు అందుబాటులో ఉన్న భారతీయ ప్రమాణాలు, నాణ్యతా పరీక్షలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు జిల్లాస్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్లో మనం వినియోగించే అన్ని రకాల ఉత్పత్తులకు హాల్ మార్క్,ఐ.ఎస్.ఐ.మార్క్ ప్రమాణాలతో హెచ్.యు.ఐ డి.సంఖ్యను కేటాయించడం జరుగుతుందని,మార్కెట్ లోని ఉత్పత్తులకు బి.ఐ. ఎస్.అనుమతులు జారీ చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భారతీయ ప్రమాణాలు నిర్ధారించే ఐ ఎస్ ఐ ముద్ర ఉన్న వస్తువులు మాత్రమే కొనాలని తెలిపారు.అన్ని ప్రభుత్వ శాఖలు మార్కెట్ లోని ఉత్పత్తులు,బి.ఐ. ఎస్.ప్రమాణాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఉత్పత్తుల నాణ్యత ప్రాముఖ్యత గురించి తెలిసి ఉండాలని,ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను తెలుసుకునేందుకు కేర్ యాప్ ఉపయోగపడుతుందని, ప్లే స్టోర్ ద్వారా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.ఈ యాప్ ద్వారా ఐ ఎస్ ఐ మార్క్ ఉన్న ఉత్పత్తి యొక్క ప్రామాణికత,లైసెన్స్ గడువు, లైసెన్స్ దారుని వివరాలు తెలుసుకోవచ్చని, హెచ్.యు.ఐ.డి.హాల్ మార్క్ గల ఆభరణాల ప్రామాణికత తెలుస్తుందని తెలిపారు. ఉత్పత్తి నాణ్యత లోపం, ఐ.ఎస్.ఐ.చిహ్నం దుర్వినియోగంపై ఆప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వస్తువుల నాణ్యత,బంగారు ఆభరణాల శుద్దత పరీక్షించుకోవడంతో పాటు టెండర్లు,ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్లో భారతీయ ప్రమాణాలు పాటించాల్సిన విషయాలపై అవగాహన కల్పించారు.భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన నియమాలు పాటించకుండా వస్తువులు అమ్మే వారు, హాల్మర్కు లేని బంగారు అభరణాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బి.ఐ.ఎస్.కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వస్తువుల నాణ్యత,బంగారం హాల్మార్కుశుద్దతను పరీక్షించుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని సూచించారు.అధికారులు సైతం టెండర్లలో తప్పనిసరిగా భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవే తెచ్చేలా కాంట్రాక్టర్లకు సూచించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking