ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా ప్రతీ రోజు ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుంది నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణితో పాటు మిగతా పని దినాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజల ఫిర్యాదులను స్వీకరించడానికి కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలు సమర్పించిన ప్రతి ఫిర్యాదుకు రసీదులు పొందవచ్చని, ఫిర్యాదుల పురోగతిని సంబంధింత శాఖల వారిగా ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking