ఉస్మానియా అంటే హైద్రాబాద్‌ కి షాన్‌ : మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

ఉస్మానియా ఆస్పత్రి లో 1951 లో నిర్మించిన జీఎన్‌ఎం నర్సింగ్‌ కాలేజీ హాస్టల్‌ భవనాన్ని నిర్మిస్తాం.
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి: రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హైదరాబాదులోని చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రి లో పర్యటన.
ఈ పర్యటనలో 16 కోట్ల 68 లక్షల రూపాయలతో పనులకు ప్రారంభోత్సవం చేశారు.
13.97 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటుచేసిన అత్యాధునిక ఎం ఆర్‌ ఐ స్కాన్‌ యంత్రాన్ని ప్రారంభించారు.

ఆధునిక కిచెన్‌ ను 2 కోట్ల 16 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రారంభించారు.
55 లక్షల రూపాయలతో జనరల్‌ మెడికల్‌ బ్లాక్‌ లో ఓపి కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ పర్యటన లో 5 కోట్ల 90 లక్షల రూపాయలతో ఉస్మానియా ఆస్పత్రిలో మార్చరి ఆధునీకరణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్‌ రాజనర్సింహ మాట్లాడుతూ..
ఎంతో ఘన చరిత్ర ఉన్న ఉస్మానియా ఆస్పత్రి కి చికిత్స చెయ్యాల్సి ఉంది…
గత పాలకులకు టీమ్స్‌ ఆసుపత్రుల నిర్మాణం పై ఉన్న శ్రద్ధ ఉస్మానియా ఆసుపత్రి పై లేదన్నారు.
ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన పై సిఎం రేవంత్‌ రెడ్డి తో చర్చిస్తాం.
సమస్యలు ఉన్నప్పటికీ ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్‌, సిబ్బంది మెరుగైన సేవలు అందజేస్తున్నారు…


ఉస్మానియా ఆస్పత్రి లో 1951 లో నిర్మించిన జీఎన్‌ఎం నర్సింగ్‌ కాలేజీ హాస్టల్‌ భవనాన్ని నిర్మిస్తాం.
హెల్త్‌ పాలసీ పై కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నం…
ప్రైమరీ, సెకండరీ హెల్త్‌ విభాగాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాబోయే తరాలు గుర్తుంచుకునేలా ప్రజా పాలన ఉంటుంది.
ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ లో అన్ని రేట్స్‌ రివైస్‌ చేస్తున్నాం.
హెల్త్‌ స్కీమ్స్‌ కి సంబంధించిన గ్యాప్స్‌ ఎక్కడ ఉన్నా వాటిని స్ట్రెంతెన్‌ చేస్తాం…
పేదలకు ప్రమాణాలతో కూడిన విద్య మెరుగైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ బాధ్యత.
కొత్త బిల్డింగ్‌ కట్టడం, కట్టకపోవడం… అనే ప్రశ్న లేదు…
కొత్త సెక్రటేరియట్‌ కట్టడం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం కాదు..
పేద వారికి మెరుగైన వైద్యం అందించాలి…
విజన్‌ ఉండాలి…


ఉస్మానియా అంటే హైద్రాబాద్‌ కి షాన్‌…..
ఉస్మానియా ఆస్పత్రి నీ కాపాడుకోవాలి…
ప్రజాపాలన అనేది గుర్తుకు రావాలి.. అహంకారం కాదు…
జీఎన్‌ఎం హాస్టల్‌ బిల్డింగ్‌ త్వరలో కట్టిస్తాం
తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తాం.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ లు ప్రభాకర్‌, వాణిదేవి, గోషామహల్‌ శాసనసభ్యులు రాజాసింగ్‌, స్థానిక బేగంబజార్‌ కార్పొరేటర్‌ శంకర్‌ యాదవ్‌, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆర్‌ వి కర్ణన్‌, ఉస్మానియా ఆసుపత్రి సూపరిటెండెంట్‌ నాగేందర్‌ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking