మునిసిపల్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి ప్రజబలం ప్రతినిధి సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు నియోజకవర్గం తెల్లాపూర్‌ మున్సిపల్‌ పరిధిలో 8 కోట్ల 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మున్సిపల్‌ పరిపాలన భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ , మెదక్‌ పార్లమెంట్‌ సభ్యులు రఘునందన్‌ రావు, పటాన్‌ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన జాతీయ జెండా స్తంభం, మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన గద్దర్‌ మల్టీపర్పస్‌ ఆడిటోరియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. శర వేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌ చెరు నియోజకవర్గ అభివృద్ధికి అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. ఈదులనాగుల పల్లి, న్యూ యంఐజీ కాలనీ మధ్య కనెక్టివిటీ రోడ్డు నిర్మాణాన్ని త్వరలో చేపడతామన్నారు
తెల్లాపూర్‌ మునిసిపాలిటీ లో అర్భన్‌ హెల్త్‌ సెంటర్‌ నిర్మాణం 15రోజుల్లో మొదలు పెడతామని హవిూ ఇచ్చారు. చెరువులను, కుంటలను కాపాడుకోవాలి.. ప్రకృతిని రక్షించుకోకపోతే భవిష్యత్తు తరాలకు మనుగడ ఉండదని హితవు పలికారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టే ప్రతిపనిలో ప్రజలు సహకరించాలని కోరారు.. ఈ సందర్భంగా మెదక్‌ పార్లమెంట్‌ సభ్యులు యంపి రఘునందన్‌ రావు మాట్లాడుతూ.
తెలంగాణ పురం శాసనం ద్వారా తెల్లాపూర్‌ కు ఎంతో చారిత్రాత్మక నేపధ్యం ఉందని, తెలంగాణపురం అనే పేరును పెట్టే అంశంపై ప్రభుత్వం పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. .తెల్లాపూర్‌ అండర్‌ పాస్‌ రైల్వే బ్రిడ్జిని పొడిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో , జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ మంజు శ్రీ జైపాల్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ లలితా సోమిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ రాములు గౌడ్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ అధ్యక్షులు దేవేందర్‌ యాదవ్‌, కౌన్సిలర్లు కో ఆప్షన్‌ సభ్యులు సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking