శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు జక్కుల తిరుపతి.
వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), బుధవారం రోజున వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ సిద్ధోగా కళ్యాణ మహోత్సవంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు మల్యాల రాజు గౌడ్ ఆహ్వానం మేరకు బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు జక్కుల తిరుపతి హాజరై శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని, గౌడ కులస్తులకు, చెక్కపల్లి గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు దానే తిరుపతి, స్థానిక బూత్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, బిజెపి నాయకులు లింగంపల్లి వెంకటేష్, మల్లారం తిరుపతి, సండే సారీ మల్లికార్జున్, నందగిరి రాహుల్ గౌడ్, జంగం వంశీ, లింగంపల్లి కిషోర్, జంగం నరేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.