అభివృద్ధికి సహకరిస్తాం, చెరువు సరిహద్దు నుంచి పైప్ లైన్ వేయండి.

 

గుడి చెరువు పరిధిలోని భూ యజమానుల ఆక్రందన.

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), వేములవాడ రాజన్న ఆలయ సుందరీకరణ పనులలో భాగంగా వేములవాడ పట్టణంలోని మురుగునీరు గుడి చెరువులోకి వెళ్లకుండా చేపడుతున్న పైప్ లైన్ నిర్మాణం తో తమ విలువైన నివాస గృహాల భూముల సముదాయాలను కోల్పోతున్నామని భూ యజమానులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. తామరందరికీ పట్టా పాస్ బుక్కులు ఉన్నాయని, పట్టా భూముల నుంచి పైప్ లైన్ వెళ్లకుండా స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి గుడి చెరువు సరిహద్దు నుంచి పైప్ లైన్ తీసుకు వెళ్ళే విధంగా చర్యలు చేపట్టాలని భూ నిర్వాసితులు కోరారు. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన ఎఫ్ టి ఎల్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నమని భూ నిర్వాసితులు వాపోయారు. వెంటనే మున్సిపల్ కమిషనర్, ప్రభుత్వ విప్ స్పందించి గుడి చెరువు ప్రక్కన ఉన్నటువంటి భూ యజమానులకు న్యాయం చేయాలని భూ నిర్వాసితులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాముల కృష్ణయ్య, ఈర్నపల్లి రాజు,ఫస్సి, లాల నర్సింగం, రామారావు, తదితర భూ నిర్వాసితులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking