వేములవాడ మండల పరిధిలో పలు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.

ముఖ్యఅతిథిగా హాజరై కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

పాల్గొన్న అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు వసంతలక్ష్మి, మార్కెట్ డిఎం రజిత, డి సి ఓ రామకృష్ణ.

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), బుధవారం రోజున వేములవాడ పట్టణంలోని బాలానగర్, రూరల్ మండలంలోని చెక్కపల్లి, మల్లారం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నేడు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా తల్లులను కోటీశ్వరులను చేయాలని సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం కొనుగోలు కేంద్రాలను మహిళలకు కేటాయించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఏకకాలంలో రైతు ప్రయోజనాల కోసం 21 వేలకోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. సన్న వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం వరి కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాసేవారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా ప్రభుత్వంలో రైతులకు ముందుగానే వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా అదనపు సెంటర్ల ఏర్పాటు చేయాలన్నారు. గతంలో వడగండ్ల వర్షం వలన రైతులు నష్టపోతే కనీసం ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు పదివేల రూపాయల నష్టపరిహారం చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో248 ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 35 సెంటర్లు ప్రారంభం చేసామని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చూడాలన్నా రు. సరిపడా టార్పాలిన్ కవర్లు, గన్ని సంచులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు పండించిన పంట చివరికించే వరకు కొంటామని ఆయన పేర్కొన్న రు. ఈ కార్యక్రమంలో రైతులతోపాటుగా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking