వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), బుధవారం రోజున వేములవాడ అర్బన్ మండలం బిజెపి పార్టీ అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ, అభియాన్ కార్యక్రమంలో భాగంగా గుర్రం వానిపల్లి గ్రామంలో మండల పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి హాజరై పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఆవిర్భావ అవశ్యకత, పార్టీ కార్యకర్తలు 45 సంవత్సరాల కాలంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, మరియు పార్టీ అంచే లంచలుగా ఎదిగిన విధానం, పార్టీ నిర్మాణం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, చరిత్రత్మక విజయాలు లాంటి పలు విషయాలను కార్యకర్తలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ప్రశాంత్, నర్సింగోజు శంకర్, ఉపాధ్యక్షులు జింక శ్రీనివాస్, తిప్పర వేణి రాజు, ఏరుగొక్కుల రమేష్, కార్యదర్శులు కొలనూరు సంజీవ్ రెడ్డి, బూర శేఖర్, అధికార ప్రతినిధి విశ్వనాథం శ్రీధర్, మండల కార్యవర్గ సభ్యులు గడ్డి ప్రశాంత్, కిసాన్ మోర్చా అధ్యక్షులు గోనె భాస్కర్, దళిత మోర్చా అధ్యక్షులు గంట మహేష్, యువమోర్చా అధ్యక్షులు నాంపల్లి అరవింద్, జిల్లా నాయకులు గుండెకార్ల లక్ష్మణ్, పోచంపల్లి భాను, బూత్ అధ్యక్షులు తునికి మహేష్, జక్కుల మధు, గాండ్ల తిరుపతి, చింతకుంట నరసయ్య, ముడికే రాములు, ముడికే శ్రీనివాస్, చొక్కాల ప్రశాంత్, నాంపల్లి తిరుపతి, జ్వాల లక్ష్మారెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.