క్రికెట్ బాల్ తలకు తగిలి బాలుడు మృతి.

 

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో క్రికెట్ ఆడుతుండగా క్రికెట్ బాల్ తలకు తగిలి దారం అశ్విత్ రెడ్డి(10) అనే బాలుడు మృతి చెందాడు.
గురువారం రోజున స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడిన ఆశ్విత్ రెడ్డి శుక్రవారం యధావిధిగా పాఠశాలకు వెళ్లాక తీవ్రంగా తలనొస్తుందని ఉపాధ్యాయులకు తెలిపారు. ఇట్టి విషయమై వెంటనే అశ్విత్ రెడ్డి తల్లిదండ్రులకు సమాచారం అందించగా, తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రికి తరలించడంతో బాబుకు తలలో రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించి అత్యవసర వైద్య సేవ నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
అశ్విత్ రెడ్డి చికిత్స పొందుతూ మంగళవారం కరీంనగర్ ఆసుపత్రిలో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావు పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి గత పది సంవత్సరాలుగా వేములవాడలో మెడికల్ షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుమారుడు అశ్విత్ రెడ్డి మృతితో కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking