నిర్మల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మైక్రో డొనేషన్ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో ప్రారంభించిన బిజెపి జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..అబ్ కీ బార్.. చార్ సౌ పార్.. అంటూ బిజెపి నాయకులు మండల అధ్యక్షులు పోలింగ్ బూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు అందరూ వారికి తోచినంతగా పార్టీకి డొనేషన్ చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు, అలాగే దేశవ్యాప్తంగా నినదిస్తున్న భారతీయ జనతా పార్టీ.ట్రిబుల్ డిజిట్‌ టార్గెట్‌తో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైంది.పార్టీ నేతలతో, నాయకులతో ఎన్నికల ప్రచార వ్యూహాలపై కమలనాథుతో నిర్మల్ జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదిలాబాద్ పార్లమెంట్ భారీ మెజార్టీతో కైవసం చేసుకునే లక్ష్యంతో నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు, బూత్ లెవల్ కో ఆర్డినేషన్, కొత్త, పాత నేతల మధ్య సమన్వయం పెంపొందించడంపై ఫోకస్‌ చేయాలని. ప్రస్తుతం ఉన్న పరిణామాలను అనుకూలంగా మలుచుకోవడంతో పాటు గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణతో కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామన్న భావన ప్రజల్లో ఉందని, కాంగ్రెస్ వైఫల్యాలే ప్రచార అస్త్రాలు అవుతున్నాయని,అలాగే సభలు, సమావేశాల కంటే ప్రతి ఇంటికీ వెళ్లి ప్రధాని మోదీ పథకాలతో పొందుతున్న ప్రయోజనాలను వివరించాలని, ప్రతి ఓటర్‌ను బీజేపీ కార్యకర్తలు కలవాలని నియోజక వర్గ నాయకులకు , నేతలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, పెద్దపెల్లి జిల్లా ఇంచార్జ్ రావుల రామనాథ్, మైక్రో డొనేషన్స్ అదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ సామ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమే రాజు, మైక్రో డొనేషన్స్ నిర్మల్ అసెంబ్లీ కన్వీనర్ కోరుపల్లి శ్రావణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కమల్నయన్, దళిత మొర్చ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాచకొండ సాగర్, అసెంబ్లీ కన్వీనర్ గాదె విలాస్, బిజెపి సీనియర్ నాయకులు కొమ్ముల వినాయక రెడ్డి మరియు భూపతిరెడ్డి, బిజెపి మైక్రో డొనేషన్స్ కొండా జి శ్రావణ్, పట్టణ అధ్యక్షులు సాదం అరవింద్, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ శ్రీ రామోజీ నరేష్ బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజేందర్ , ఆడెపు సుధాకర్, నిర్మల్ జిల్లా అధికార ప్రతినిధి బర్కుంట నరేందర్, వివిధ మండలాల అధ్యక్షులు, గార్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking