ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కరాటే ఎంపిక పోటీలను డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు చిన్నారుల ఆత్మరక్షణకు కరాటే ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. చిన్ననాటి నుండి వీటిపట్ల విద్యార్థులు ఆసక్తి చూపాలని అన్నారు.కరాటేలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పథకాలు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ నాయకులు తేజేంద్ర సింగ్ భాటియా, భూషణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ నరేష్ ,నందేడపు చిన్ను గాజుల రవి కుమార్ ,కొంతం గణేష్ ,గడ్డింటి ప్రశాంత్ తదితరులున్నారు